తిరుపతి ముచ్చట్లు:
ఫోటోలో కనిపిస్తున్న గుర్తు తెలియని మహిళ తిరుమలలోని వరాహస్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న ఓపెన్ ప్రదేశంలో అపస్మారక స్థితిలో కనిపించగా, వెంటనే ఆంబులెన్స్ ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని SVIMS ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది.
అయితే, సదరు మహిళ SVIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె పేరు, చిరునామా మరియు ఇతర వివరాలు తెలియరాలేదు.
- గుర్తించేందుకు ఆనవాళ్లు:
- వయస్సు సుమారు 55 నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటుంది.
- గుండు చేయించుకుని ఉన్నది.
- చామనచాయ వర్ణం.
- గుండ్రటి ముఖాకృతి.
ప్రస్తుతం సదరు మహిళ మృతదేహం తిరుపతిలోని SVIMS ఆసుపత్రి మార్చురీలో భద్రపరచబడింది.
పై వివరాల ఆధారంగా ఎవరైనా మహిళను గుర్తించినట్లయితే, వెంటనే వారి బంధువులకు సమాచారం అందించగలరు లేదా క్రింది ఫోన్ నంబర్ల ద్వారా 1 టౌన్ పోలీస్ స్టేషన్, తిరుమల పోలీసులను సంప్రదించగలరు.
SI : 9440796771
CI : 9440796772
1 టౌన్ పోలీస్ స్టేషన్, తిరుమల.
Tags: Unidentified woman dies.