May 23, 2026
Explore
కంటిచూపును కాపాడుకోవాలి

కంటిచూపును కాపాడుకోవాలి

May 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రతి ఒక్కరు కంటిచూపును జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు రహమత్‌అలీఖాన్‌, మురళికృష్ణ లు సూచించారు. శనివారం విశ్రాంత ఉద్యోగులచే ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి జబ్బులకు చికిత్సలు చేసి, అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆహారం , అలవాట్లు కారణంగా చిన్నపిల్లల్లో సైతం కంటి చూపు సమస్యలు ఏర్పడుతోందని , ఈవిషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని, పిల్లలకు పోషక ఆహారాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్రాం ఉద్యోగులు చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Tags: We must protect our eyesight.