పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటిలో ఆపరేషన్‌క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం మదనపల్లె సబ్‌కలెక్టర్, మున్సిపాలిటి స్పెషలాఫీసర్ కళ్యాణి ప్రారంభించారు. స్థానిక గోకుల్ సర్కిల్‌లో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, కార్మికులతో కలసి జాతీయ రహదారిని శుభ్రం చేశారు. అన్నక్యాంటిన్ వద్ద మొక్కలు నాటి , క్యాంటిన్‌లో ఆహార పంపిణీని పరిశీలించి కార్మికులతో కలసి అల్పాహారం తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు బాగస్వాములు కావాలని కోరారు. అలాగే వ్యాపారులు, హ్గటళ్లలో , మార్కెట్లలో తడిచెత్త, పొడిచెత్త , ప్రమాదకర వ్యర్థాలు వేరు చేసి మున్సిపల్ కార్మికులకు ఉదయం అందించాలన్నారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయడం , పారిశుద్ధ్య కార్యక్రమాలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి , జరిమానాలు విధించడం , వారి లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటిలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ మహేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మునివెంకటప్ప, కార్మికులు పాల్గొన్నారు.

Tags: Special Officer Kalyani Launches ‘Operation Clean Sweep’