May 23, 2026
Explore
పుంగనూరు రెవెన్యూ అక్రమాలు ఆ ముగ్గురి చేతుల్లో

పుంగనూరు రెవెన్యూ అక్రమాలు ఆ ముగ్గురి చేతుల్లో

May 23, 2026 | Andhra Pradesh

మండలంలో పెరిగిన భూ సమస్యలు

ఏళ్లతరబడి నాటి రికార్డులు మార్పిడి

ఆందోళన చెందుతున్న భూ యజమానులు

పుంగనూరుముచ్చట్లు:

జమీందారి పాలన నాటి రెవెన్యూ రికార్డులను తహశీల్ధార్‌ కార్యాలయంలో మార్చే కార్యక్రమాలు చాపకింద నీరులా సాగుతోంది. దీనికి కేంద్ర బిందువుగా రెవెన్యూ ఆధికారి, ఒక న్యాయవాది , ఒక డాకుమెంట్‌రైటర్‌ స్నేహితులు కావడం మండలంలోని భూ యజమానులను , రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. తహశీల్ధార్‌ కార్యాలయంలో, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ ముగ్గురు తిష్ట వేసి పథకం ప్రకారం నకిలి డాకుమెంట్లు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ డాకుమెంట్లను కోర్టులో వేయడం, ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం సాగిపోతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నకిలి రికార్డులతో రెవెన్యూ అధికారి పురాతన కాలం నాటి రికార్డులను చెత్తబుట్టలో పడేసి , నకిలి రికార్డులతో 1బిలు మార్చుతున్నారు. తహశీల్ధార్‌, డిప్యూటి తహశీల్ధార్లు , మండల సర్వేయర్‌కు ఈ విషయాలు తెలిసిన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. అలాగే రెవెన్యూ అధికారి తమ ఇష్టారాజ్యంగా ఇరువురి వద్ద బేరాలు చేయడం , తమకు నచ్చినట్లు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపడం సర్వసాధారణమైంది. వ్యాపారం కుదరకపోతే కలెక్టర్‌ ఆదేశించినా , హైకోర్టు ఆదేశించినా నివేదికలు మాత్రం పంపకుండ ప్రజలను కార్యాలయం చుట్టు తిప్పుకుంటు ఉండటం విమర్శలకు దారితీస్తోంది. వీటిపై ఆర్టీఐ క్రింద సమాచారం కోరిన అర్జీలను సైతం చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. అధికార పార్టీ వారి పనులకు కూడ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో వారు అతనిని బదిలీ చేయించేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే ఆ ముగ్గరి వ్యవహారాలలో నిజాయితీ భూ స్వాములు సైతం బలౌతున్నారు. రెవెన్యూలో అధికారుల పనితీరుపై గత వారం అధికార పార్టీ నాయకులు సైతం కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేయడం , పై ఆరోపణలను రుజువు చేస్తోంది.

Tags: Punganur Revenue Irregularities: In the Hands of Those Three