May 23, 2026
Explore
ఏపీలో ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్

ఏపీలో ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్

May 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో ఎండల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రూ.48 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,192 మంది సిబ్బందికి యూవీ గాగుల్స్, వైట్ క్యాప్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, మాస్కులు అందించనున్నారు. అవసరమైన సామగ్రి కొనుగోలు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తిచేసి.. వీలైనంత త్వరగా ప్రతి యూనిట్ను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags: Good News for Traffic Police in AP