బాపట్ల ముచ్చట్లు:
బాపట్ల పట్టణంలోని ఆంధ్రకేసరి నగర్‌లో విశ్రాంత ఏడీ పోకల వెంకటేశ్వరరావు ఇంటి పెరట్లో అరుదైన భారీ కంద జాతి పుష్పం పూసి ఆకట్టుకుంటోంది. బెంగళూరులో కొనుగోలు చేసిన కందను ఇంటి వద్ద నాటగా, ఇటీవల భారీ ఆకారంలో పువ్వు విరబూసింది.ఏనుగు పాదాన్ని పోలి ఉండే ఈ పుష్పాన్ని శాస్త్రీయంగా ‘ఎలిఫెంట్ ఫుట్ యామ్’గా పిలుస్తారని వెంకటేశ్వరరావు తెలిపారు. పదేళ్లకు ఒక్కసారి మాత్రమే మే, జూన్ నెలల్లో ఈ పుష్పం పూస్తుందని, దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
Tags: A Rare Flower That Blooms Once Every Ten Years—Queues Form in Bapatla to See It!