May 23, 2026
Explore
Rti యాక్టివిస్ట్ లుగా

Rti యాక్టివిస్ట్ లుగా

May 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న ఈ అబ్బాయి ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ అయ్యాడు.

మొన్న మే 15 నాడు భారత ప్రధాన న్యాయమూర్తి CJI – సూర్యకాంత్ , జస్టిస్ జాగ్మల్య బాగ్చి తో కూడిన బెంచ్ ఒక కేస్ హియరింగ్ లో భారతదేశంలోని నిరుద్యోగ యువతను ” cockroaches” తో పోల్చాడు.

అంతటితో ఆగకుండా ఉద్యోగాలు లేక వీళ్ళు పారసైట్ లుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారని , rti యాక్టివిస్ట్ లుగా మారుతున్నారని అన్నాడు.దేశ అత్యున్నత న్యాయస్థానం నుండి ఈ వ్యాఖ్యలు సర్వత్రా పెను దుమారం లేపాయి.” మేము బొద్దింకలమే తప్పకుండా ఈ కుళ్ళిన వ్యవస్థలను ప్రశ్నిస్తాం , ఇది ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు ” అని వేలమంది యువత స్పందించారు . న్యాయమూర్తి వ్యాఖ్యలకు ధీటుగా వందల్లో వెబ్సైట్స్ మీమ్స్ వీడియోలు తయారయ్యాయి.

ఈ అబ్బాయి ” అభిజీత్ దీప్కే” ఏకంగా ” కాక్రోచ్ జనతా పార్టీ ” అనే రాజకీయ పార్టీ పెడుతున్నట్టు కామెంట్ పెట్టాడు.అంతే దేశవిదేశాల నుండి ఊహించలేని రెస్పాన్స్ వచ్చింది.అతని పార్టీలో సభ్యత్వం ఇవ్వమని ఒక్కరోజే 46,000 మందినుండి రిక్వెస్ట్ లు వచ్చాయి.rti యాక్టివిస్ట్ లు, విద్యావేత్తలు , స్టూడెంట్స్ నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి..పార్టీ ప్రకటనతో వెనక్కు తగ్గొద్దు అని ఇప్పటి ఏ పార్టీతోనూ చదువుకున్న వాళ్ళు,నేటి యువత రిలేట్ కాలేకపోతున్నారని కుప్పలుతెప్పలుగా లెటర్స్ వస్తున్నాయి.కాక్రోచ్ జనతా పార్టీ అప్లికేషన్ ను ఫిల్ చేసేందుకు సర్వర్ డౌన్ అయ్యేంత డిమాండ్ ఏర్పడింది.

అభిజిత్ తన స్నేహితులతో చర్చించి, టీమ్ గా మారారు. అప్పటికప్పుడు వెబ్సైట్ తయారుచేశారు.ఈ ” కాక్రోచ్ జనతా పార్టీ” వెబ్సైట్ ను నాలుగు సెక్షన్లు గా విభజించారు.మేనిఫెస్టో , డిజైన్ , ఎలిజిబిలిటీ, కాంటాక్ట్. పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.మొట్టమొదటి అంశం ” రిటైర్డ్ జడ్జ్ లను రాజ్యసభకు పంపడాన్ని వ్యతిరేకిస్తాము” అని.CJP అధికారంలోకి వస్తే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు.

ఒక చిన్న కామెంట్ తో మొదలైన ఈ అంశం నిజంగానే సీరియస్ గా రాజకీయ పార్టీ రూపకల్పనకు దారితీయడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది.

కీర్తి అజాద్ , మహువా మొయిత్ర, ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖులు ఈ కాక్రోచ్ పార్టీలో చేరతామని, అందుకు ఏం అర్హతలు ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు.కోక్రోచ్ జనతా పార్టీ రూపొందించిన వెబ్సైట్ కు 22,000 మంది ట్విట్టర్ లో ,34000 మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అయ్యారు.ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని , ఎలా ముందుకు వెళ్ళాలో ఇంకా ఆలోచిస్తున్నామని అభిజిత్ అంటున్నాడు.

ఏ మాత్రం అకౌంటబిలిటీ లేని రాజకీయ నాయకులు, నిజమైన ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని పార్టీల పట్ల యువత విసిగిపోయి ఉన్నారు. చాలామంది కాక్రోచ్ ఫొటోలు ఉన్న టీ షర్ట్స్ ధరించి ” అవును మేము బొద్దింకలమే ” అనే క్యాంపెయిన్తో నీటి పరిశుభ్ర కార్యక్రమాలు చేపడుతున్నారు.న్యూక్లియర్ వార్ వచ్చినా బొద్దింకలకు ఏమీ కాదని అంటూ లక్షల మంది CJI వ్యాఖ్యలను ఖండిస్తున్నారు..మహారాష్ట్ర శంభాజీ పూర్ వాస్తవ్యుడైన అభిజీత్ ఏకంగా బొద్దింక పేరుతో పార్టీ అనౌన్స్ చెయ్యడం ఆన్లైన్ ను , మేధావులను , జెన్ జీ యువతను ఒక్కసారిగా ఆకర్షించింది.

ఈ రియాక్షన్ ను ఊహించని న్యాయమూర్తి గారు తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని , ఫేక్ డిగ్రీలు ఉన్న వాళ్లను ఉద్దేశించి అన్నానని చెప్పారు.ఇది ఇంకో ఇంకో లాఫింగ్ స్టాక్ కు దారితీసింది.

ఈ కాక్రోచ్ జనతా పార్టీ టీ కప్పులో తుఫానో ..నిజంగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందో వేచిచూడాలి..

Tags: As RTI Activists