May 22, 2026
Explore
ఇన్సూరెన్సు డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేశాడు..!

ఇన్సూరెన్సు డబ్బుల కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేశాడు..!

May 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

ఉరివేసుకుని చనిపోయిందంటూ బుకాయించాడు..! అయితే అసలు నిజం బయటపడడంతో వాడు ఎంతటి దుర్మార్గుడో అందరికీ తెలిసిపోయింది..!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది..!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తే తన భార్యని హత్య చేసినట్లు బంధువులు ఆరోపించడంతో అనుమానించిన పోలీసులు ఆకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.!

అంతే కాదు వాడి ఉన్మాద దాడి దృశ్యాలు బయటకు రావడంతో చుట్టు పక్కల వాళ్ళే కాదు.. ఈ వీడియో చూసినవాళ్లందరూ వాడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు..!

ఇంటిపై ఎనబై లక్షలు లోన్ ఉండడంతో..భార్య పేరు పై ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్ పై కన్నేశాడు..! ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే భార్యని చంపేయాలని కుట్రచేశాడు..!

ముందస్తు ప్లాన్ లో భాగంగా ఆమెను నిద్రలో ఉన్నప్పుడు ఉరివేసి చంపాలనుకున్నాడు.. అయితే అది కాస్త బెడిసికొట్టి భార్య తేరుకుని ప్రతిఘటించింది..! దీంతో వాడు రెచ్చిపోయాడు.!

కాళ్లు చేతులు వడివేసి విరిచేసే ప్రయత్నించేశాడు.. అంబోతులా మీదపడి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు.. వాడి పిడిగుద్దుల ధాటికి ఆమె తట్టుకోలేకపోయింది.. అలాగే ప్రాణాలు విడిచింది..!

ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని.. ఆపై ఫ్యాన్ రాడ్ కు ఉరివేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం మొదలుపెట్టాడు..

అయితే వాడు దాడి చేస్తుండగా ఎవరు వీడియో తీసారో తెలియాల్సి ఉంది.. దాడి చేస్తున్న దృశ్యాలను వేరే వ్యక్తులు వీడియో తీసినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది..

మొత్తానికి ఇన్స్యూరెన్స్ మాత్రమే హత్యకు కారణమా.. ఇంకేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..!

స్థానిక చెబుతున్న వివరాల ఆధారంగా లోతుగా విచారణ చేస్తున్నారు..!

అయితే ప్రస్తుతం.బయటకు వచ్చిన వీడియో గతంలో భార్యపై నిందితుడు దాడి చేసినవని బంధువులు చెబుతున్నారు..

హత్యకు ముందు దాడి చేసిన దృశ్యాలు ఏవీ బయటకు రాలేదని.. అవి పాతవి అని చెబుతున్నారు..

Tags; He beat his wife—whom he had loved and married—to death for the insurance money.