May 22, 2026
Explore
మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వాహిదున్నిసా మృతి

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వాహిదున్నిసా మృతి

May 22, 2026 | Andhra Pradesh

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ ల సంతాపం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ హజీపి.వాహిదున్నిసా (76) శుక్రవారం ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఎంపి మిధున్‌రెడ్డి బెంగళూరు వైదేహి ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిలు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా వాహిదున్నిసా 1995 నుంచి 2000 సంవత్సరం వరకు మున్సిపల్‌ చైర్మన్‌గా ప్రజలకు నిజాయితీగా సేవలు అందించారు. ఆమె మృతి వార్త తెలియగానే పట్టణ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్లు కొండవీటి నాగభూషణం, అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డితో పాటు పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు.

Tags; Former Municipal Chairperson Wahidunnisa Passes Away