పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో ఆపరేషన్‌క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు, హ్గటళ్లలో , మార్కెట్లలో తడిచెత్త, పొడిచెత్త , ప్రమాదకర వ్యర్థాలు వేరు చేయాలన్నారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి, దుకాణాదారులు వ్యాపార లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
Tags: Operation Clean Sweep Begins