30 రోజులకు ఇవ్వాల్సిన సమాచారం
మూడు నెలలు గడచిన ఇవ్వని సమాచారం
ఎస్టీ నేత ఫిర్యాదు
పుంగనూరు ముచ్చట్లు:
సమాచార హక్కు చట్టం క్రింద పుంగనూరు తహశీల్ధార్ కార్యాలయానికి ధరఖాస్తు చేసి మూడు నెలలు గడచిన సమాచారం ఇవ్వకపోవడంతో పట్టణ ఎరుకుల సంఘం అధ్యక్షుడు మర్రిమాకులపల్లె బాబు శుక్రవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని రెవెన్యూకు సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ రెవెన్యూ అధికారులు కొంత మంది అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం అందించాలని బాబు 18-02-2026 న రెవెన్యూసమాచార శాఖాధికారికి పోస్టుద్వారా పంపారు. నిబంధనల మేరకు అర్జీపై 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలి. కానీ ఇందుకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆర్టీఐ దరఖాస్తులు అంటే అధికారుకు గౌరవం లేకపోవడంతో ఆర్టీఐ చట్టం నవ్వులపాలౌతోంది. అలాగే అనేక మంది ఆర్టీఐ క్రింద ధరఖాస్తు చేసిన సమాచారం ఇవ్వకుండ, రెవెన్యూ అధికారులు అర్జీలను చెత్తబుట్టలో పడేశారని ధరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు.
Tags; The RTI Act Becomes a Mockery in the Revenue Department