కడప ముచ్చట్లు:
కడప జిల్లాలో ఐదు కోవిడ్-19 కేసులు నమోదుకాగా, ఇద్దరు మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
మృతులు ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెల్లడించింది.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సమాచారం లేదన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేసింది.
నమోదైన కేసులపై ఆరోగ్యశాఖ నిఘా కొనసాగిస్తోందని..,
వైరస్‌లో కొత్త వేరియంట్లు ఉన్నాయా అని తెలుసుకునేందుకు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యు విశ్లేషణ కోసం పంపిస్తున్నట్లు తెలిపింది.
Tags:5 COVID-19 cases recorded in AP; government responds.