May 22, 2026
Explore
ప్రేమ నిరాకరణతో యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమ నిరాకరణతో యువతి ఆత్మహత్యాయత్నం

May 22, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె పరిధిలోని చౌడేపల్లి మండలం బోయకొండ షికారిపాల్యంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సమాచారం మేరకు శివాని(22) అనే యువతి కర్ణాటకలోని షికారిపురలో నివసిస్తోంది. అక్కడే నివసించే రాఘవ్‌ను ప్రేమించినట్లు తెలిసింది. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన శివాని శుక్రవారం విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Tags: Young Woman Attempts Suicide After Love Rejection