May 22, 2026
Explore
శునకాల దాడిలో గాయపడ్డ వన్యప్రాణి.. కాపాడిన గ్రామస్తులు

శునకాల దాడిలో గాయపడ్డ వన్యప్రాణి.. కాపాడిన గ్రామస్తులు

May 22, 2026 | Andhra Pradesh

సిద్ధవటం ముచ్చట్లు:

సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామం రోడ్ నెం.19 వద్ద శుక్రవారం ఉదయం శునకాల దాడిలో గాయపడిన వన్యప్రాణిని గ్రామస్తులు కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం వచ్చిన పొడ దుప్పిపై శునకాలు దాడి చేయడంతో గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వన్యప్రాణిని రక్షించి ఒంటిమిట్ట ఫారెస్ట్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

అటవీ శాఖ అధికారులు గాయపడిన దుప్పిని చికిత్స అనంతరం ఒంటిమిట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నర్వకాటిపల్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలిపారు.

Tags; Wildlife Injured in Dog Attack—Rescued by Villagers