March 20, 2026
Explore
గోదావరిలో విషాదం.. 5 మంది బీటెక్ విద్యార్థులు గల్లంతు

గోదావరిలో విషాదం.. 5 మంది బీటెక్ విద్యార్థులు గల్లంతు

March 20, 2026 | Andhra Pradesh

గోదావరి ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన వీరు నదిలో స్నానాలకు దిగగా ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. అమరావతి లోని ఎస్ఆర్‌ఎంటీ (SRMT) కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్‌లతో కలిసి ఎటపాక మండలం లోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి నది లోకి దిగారు. ఫోటోలు తీసుకుంటూ ఉండగా ఏడుగురు యువకులు అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్‌లుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిస్క్యూ బృందం కూడా మృతదేహాల కోసం గాలిస్తోంది.

Tags: Tragedy in Godavari.. 5 B.Tech students missing