May 22, 2026
Explore
30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు: రాజ్యాంగ సవరణపై కీలక భేటీ

30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దు: రాజ్యాంగ సవరణపై కీలక భేటీ

May 22, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025పై గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.

ఈ భేటీకి తెలంగాణ, చత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల ప్రతినిధులతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు.

తెలంగాణ తరఫున సీఎస్ రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను కమిటీకి వివరించారు.

ఈ సవరణలో కొన్ని సెక్షన్ల కింద నమోదయ్యే కేసులు, 30 రోజుల పాటు జైల్లో ఉండే నిబంధనలపై మార్పులు చేయాలని తెలంగాణ కోరినట్లు సమాచారం.

ఈ బిల్లు గతంలో లోక్‌సభలో తీవ్ర చర్చకు దారితీసింది.

Tags:Office to be Revoked if Jailed for 30 Days: Key Meeting on Constitutional Amendment