మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలంలో మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఆరోగ్యవరం గ్రామానికి చెందిన ముస్తఫా నివాసం ఉంటున్న వీధికి ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను ఎదురింటి వారు కొడుతుండగా ముస్తఫా భార్య హసీనా (40) అడ్డుకునేందుకు వెళ్లింది.
దీంతో ఆగ్రహించిన వారు హసీనాపై దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Tags: Woman Attacked in Madanapalle