May 21, 2026
Explore
ఆటో బోల్తా.. ఒకే కుటుంబంలోని ఐదుగురికి గాయాలు

ఆటో బోల్తా.. ఒకే కుటుంబంలోని ఐదుగురికి గాయాలు

May 21, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లె ముచ్చట్లు:

నిమ్మనపల్లె మండల సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు. బాధితుల వివరాల మేరకు.. బుగ్గకాలువకు చెందిన రెడ్డమ్మ నిమ్మనపల్లి మండలంలో మామిడి తోటను గతేడాది లీజుకు తీసుకుంది. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్లి మామిడి కాయలు కోసి ట్రాక్టర్‌లో ఇంటికి పంపించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో ఆటోలో మదనపల్లెకు వస్తుండగా పిట్టావాండ్లపల్లి సమీపంలో ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురు గాయపడగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Tags: Auto Overturns: Five Members of Same Family Injured