May 21, 2026
Explore
పీలేరులో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

పీలేరులో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

May 21, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరులోని రాజీవ్‌నగర్‌లో మద్యం మత్తులో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలు, ఐరన్ రాడ్లతో పరస్పరం దాడులకు దిగడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ప్ర‌మాదంలో నలుగురు గాయపడగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలో బెల్ట్ షాపులు, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Clash between TDP factions in Pileru.