May 21, 2026
Explore
వేసవి సెలవులు కుటుంబాలలో విషాదం

వేసవి సెలవులు కుటుంబాలలో విషాదం

May 21, 2026 | Andhra Pradesh

ఎందరి మాతృ మూర్తులకు కడుపుకోత మిగిల్చింది!

వేసవి సెలవులు కావడంతో గుడికి వెళ్లిన కుటుంబం ప్రమాదవశాత్తు ఆలయ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి


జగిత్యాల ముచ్చట్లు:

మేడిపల్లి మండలం కొండాపూర్‌‌లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆలయ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

కొండాపూర్ శివగంగ వద్ద మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు వెళ్లారు.

ఈ క్రమంలో అడుకుంటూ ప్రమాదవశాత్తు కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు షార్వింద్(7), మనస్వి (9), మన్వీత్(11) గా గుర్తించారు.

చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags; Summer Holidays Bring Tragedy to Families