-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నెల్లూరు ముచ్చట్లు:
తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన
గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర పరిస్థితిగా గుర్తింపు
శబ్ద కాలుష్య నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టీకరణ
నెల్లూరు ‘వైట్ కేటగిరి’ పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశం
దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కేవలం నివేదికలకే పరిమితం కావొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీసీబీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు
రాష్ట్రంలోని 13 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం’ కింద కేటాయించిన రూ.400 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పీసీబీలో సిబ్బంది కొరతపై అధికారులు ప్రస్తావించగా, నియామకాల ఫైలును వెంటనే ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
Tags: Strict action against polluting industries is inevitable.