పుంగనూరుముచ్చట్లు:
సామాన్యుడికి అందుబాటులో లేకుండ నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. కానీ బహిరంగ మార్కెట్‌లో సరుకుల ధరలు ఆకాశానంటుతున్నాయి. వీటిని నియంత్రించాలని కోరుతున్నారు.
ధరలపై నియంత్రణ లేదు….
సరుకుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిలో ధరలు పెంచేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోవడంతో సామాన్య ప్రజానికం దోపిడికి గురౌతున్నారు. సరుకుల ధరలు పెరిగిందని హ్గటళ్లో టిఫన్ రేట్లు పెంచితే ప్రజలు గొడవలు చేస్తారు. పెంచకపోతే నష్టపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో హ్గటళ్లు నిర్వహించడమా…లేక మూసివేయడమా అన్న సందిగ్ధలో పడింది.

- కోట రెడ్డిప్రసాద్, హ్గటళ్ల సంఘ నాయకుడు, పుంగనూరు.
కొనలేం…తినలేం….
ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశనంటుతుండటంతో సరుకులను కొనలేం…తినలేం…అన్నరీతిలో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. మార్కెట్‌లో ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీని కారణంగా వ్యాపారస్తులు స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి , ధరలు పెంచి విక్రయాలి సాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని , ధరల పెరుగుదలకు కళ్ళెం వేయాలి.

- ఎస్.సల్మా, హ్యూమన్‌రైట్స్ కమిషన్ అధ్యక్షురాలు, పుంగనూరు.
Tags: The prices of essential commodities must be controlled.