పుంగనూరుముచ్చట్లు:
ఇంటర్మీడియట్ పరీక్షలలో పెయిల్ అయిన విద్యార్థులకు గురువారం సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల చీఫ్ మోహనాచారి, ఎంఈవో రెడ్డెన్నశెట్టి లు బుధవారం తెలిపారు .పట్టణంలోని ఎన్‌ఎస్.పేటలో గల బసవరాజ కళాశాలలో పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే మద్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతుందన్నారు. పదిరోజుల పాటు జరిగే పరీక్షలకు 2050 మంది విద్యార్థులు హాజరౌతున్నట్లు తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండ పకడ్భంధిగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Tags; Intermediate Supplementary Exams on the 21st