పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బైపాస్‌రోడ్డులో గల ఆర్టీసి డిపో వద్ద నేషనల్ మజ్ధూర్ సంఘ అసోసియేషన్ పిలుపు మేరకు కార్మికులు నిరసన తెలిపారు. బుధవారం అన్నమయ్యజిల్లా కార్యదర్శి మునికృష్ణ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్‌సి కమిటిని నియమించి, ఐఆర్, డిఏ లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రయాణికులకు సరిపడ బస్సులు లేకపోవడంతో సిబ్బందికి, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతుందన్నారు. తక్షణమే కొత్త బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసిని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
Tags: National Mazdoor Protest at RTC Depot