-ఆన్‌లైన్ విక్రయాలపై నిరసన
-పట్టణంలో ర్యాలీ
పుంగనూరుముచ్చట్లు:
ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మెడికల్‌షాపు యజమానులు బుధవారం షాపులు మూసివేసి బంద్ పాటించి, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆల్‌ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రి అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు షాపు యజమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్‌లో నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి అమరనాథ్, శ్రీధర్, ఫకృద్ధిన్‌షరీఫ్, తీర్థానందరెడ్డి లు మాట్లాడుతూ ప్రిస్కిప్‌షన్ లేకుండ ఆన్‌లైన్‌లో మందులు నేరుగా విక్రయాలు సాగించడం బాధకరమన్నారు. ముఖ్యంగా ఇలాంటి చర్యలు కార్పోరేట్ కంపెనీలకు అనుకూలంగా మారుతోందని , కార్పోరేట్ కంపెనీలు తమ ఇష్టారాజ్యాంగ విక్రయాలు సాగిస్తారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయమై స్పందించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు. షాపులు మూసివేయడంతో పట్టణంలోని ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ నిరసనలో ఇట్టాభానుప్రకాష్, సుబ్బరాయప్ప, కృష్ణమూర్తి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
Tags: Patients Face Hardships Due to Closure of Medical Shops