తిరుపతి ముచ్చట్లు:
- మత్తు పదార్థాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు.
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు.
- బి.ఎన్. కండ్రిగ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలపై ప్రత్యేక కౌన్సిలింగ్.
- ప్రత్యేక టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన.
- యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసుల సూచనలు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం, సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పడం లక్ష్యంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి డీఎస్పీ ఆధ్వర్యంలో బి.ఎన్. కండ్రిగ పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు, గంజా సేవించే వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ప్రత్యేక టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరకంగా, మానసికంగా మరియు కుటుంబ పరంగా కలిగే అనర్థాల గురించి వివరించారు.
- అలాగే మత్తు పదార్థాల అలవాటు వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతి భద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అధికారులు తెలియజేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు మంచి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
- ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
Tags: The eradication of narcotics is the primary objective.