May 20, 2026
Explore
దొంగతనం కేసులో ముద్దాయికి 3 సంవత్సరాల జైలు శిక్ష

దొంగతనం కేసులో ముద్దాయికి 3 సంవత్సరాల జైలు శిక్ష

May 20, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

దొంగతనం కేసులో ముద్దాయికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹5,000/- జరిమానా: దర్యాప్తు అధికారి, అదనపు పి.పి.లను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,

అనకాపల్లి ముచ్చట్లు:

రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో, గౌరవనీయ చోడవరం కోర్టు నిందితుడికి 3 సంవత్సరాల సాధారణ కారాగార శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ నేడు (20.05.2026) సంచలన తీర్పు వెలువరించింది. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులను, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేకంగా అభినందించారు.

​కేసు వివరాలు:
​గత ఏడాది తేది 21.08.2025న రావికమతం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారురాలు గెంజి దేవి తమ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సుమారు అర తులం బంగారం, 50 తులాల వెండి మరియు రూ.1,00,000/- నగదు దొంగిలించారని రావికమతం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
​బాధితురాలి ఫిర్యాదు మేరకు రావికమతం పి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ కె.ఈశ్వరకుమార్ ప్రాథమిక విచారణ జరిపి FIR నమోదు చేశారు.
పోలీసుల చాకచక్యం – రికవరీ:
​ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును రావికమతం సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.రఘువర్మ స్వీకరించారు. సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితుడైన గొల్లపూడి శ్రీను (వయస్సు 35 సం||లు, తండ్రి: మురళీ, వైశ్య కులం, కొత్తపాలెం గ్రామం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా) ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించబడిన వెండి మరియు నగదును రికవరీ చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దర్యాప్తు అధికారి రఘువర్మ నిర్దేశిత సమయంలోనే కోర్టులో పకడ్బందీగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

నేడు కోర్టు తీర్పు:
​చోడవరం AJFCM కోర్టులో ఈరోజు జరిగిన విచారణలో, గౌరవనీయ ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ బి.వి.విజయలక్ష్మి (Hon’ble I/C AJFCM /PJCJC, Chodavaram) ఎదుట నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
​గౌరవ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిప్రియ దేవరకొండ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన వాదనలు వినిపించారు. నేరం పూర్తిగా రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి నిందితుడు గొల్లపూడి శ్రీనుకు:
​03 సంవత్సరాల సాధారణ కారాగార శిక్ష
​రూ.5,000/- జరిమానా (ఫైన్ కట్టని యెడల అదనంగా 01 నెల జైలుశిక్ష) విధిస్తూ తీర్పు చెప్పారు.

​జిల్లా ఎస్పీ అభినందనలు:
​బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరిగేలా శ్రమించిన రావికమతం ఎస్‌.ఐ మరియు దర్యాప్తు అధికారి ఎం.రఘువర్మను, కోర్టులో కేసును సమర్థవంతంగా నడిపిన అదనపు పి.పి హరిప్రియ దేవరకొండను, మరియు రావికమతం పోలీసులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేకంగా అభినందించారు.
​”నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో నేరాలు తగ్గుతాయని, బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో కూడా కోర్టు మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేస్తాం” అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

Tags: Accused sentenced to 3 years in prison in theft case.