– అరండల్‌పేట ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు మార్గాల ఏర్పాట్,.
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు నగరంలోని బ్రాడీపేట – అరండల్‌పేట ప్రాంతాల మధ్య రైల్వే ట్రాక్ వద్ద చేపడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులలో భాగంగా, బ్రాడీపేట 4వ లైన్, అరండల్‌పేట 4వ మరియు 5వ లైన్ల పరిధిలో నూతన పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.ఈ నిర్మాణ పనుల కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం తలెత్తకుండా రేపటి(21.05.2026) నుండి ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నట్లు గుంటూరు నగర ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం తగిన సంఖ్యలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని నియమించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
అమలులో ఉండే ట్రాఫిక్ డైవర్షన్లు:
🔹 బ్రాడీపేట నుండి అరండల్‌పేట వైపుకు వెళ్లే వాహనాలు
బ్రాడీపేట 4/7 లైన్ ప్రాంతం నుండి పాత పోలీసు క్వార్టర్స్ పక్కనున్న రహదారి ద్వారా వెళ్లి, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పక్క రోడ్డుమీదుగా అరండల్‌పేటలోనికి ప్రవేశించవలెను.
🔹 బ్రాడీపేట 2వ మరియు 3వ లైన్ల పరిసర ప్రాంతాల నుండి అరండల్‌పేటకు వెళ్లే వాహనాలు
అరండల్‌పేట 1వ లైన్ (రైల్వే స్టేషన్ రోడ్) మార్గాన్ని ఉపయోగించుకోవచ్చును.
🔹 పట్టాభిపురం, AT అగ్రహారం, అశోక్‌నగర్ ప్రాంతాల నుండి బ్రాడీపేట వైపుకు వచ్చే వాహనాలు
LEM స్కూల్ రోడ్ నుండి లాడ్జి సెంటర్ మీదుగా అరండల్‌పేట వైపుకు వెళ్లవలెను.
🔹 లాడ్జి సెంటర్ నుండి అరండల్‌పేట 5వ లైన్ వైపుకు వెళ్లే వాహనాలు
అరండల్‌పేట 6వ లైన్ నుండి 10వ లైన్ రోడ్ల ద్వారా డొంకరోడ్డు వైపుకు మళ్లించబడతాయి. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు…