కళ్ల ముందే ఘరానా మోసం..!
అమరావతిముచ్చట్లు:
ప్రజలను బహిరంగంగానే మోసం చేస్తున్న వ్యాపారులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఒక లీటర్ కొబ్బరి నీరు అంటూ రూ.110 వసూలు చేస్తున్నారు. కానీ బాటిల్‌పై చూసే సరికి అందులో ఉన్నది కేవలం 800 ఎంఎల్ మాత్రమే.
ఇదే విషయాన్ని వినియోగదారులు ప్రశ్నిస్తే.. “మేమేమైనా బాటిళ్లు తయారు చేస్తున్నామా..?” అంటూ నిర్లక్ష్య సమాధానాలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అదే పరిస్థితి ఫుడ్ వ్యాపారాల్లో కూడా కనిపిస్తోంది. చికెన్ పకోడీ 100 గ్రాములకు రూ.60 అంటూ బోర్డులు పెడుతున్నారు. కానీ ముందుగా సగం ఉడికించిన చికెన్‌ను 100 గ్రాములు తూకం వేసి.. తర్వాత ఫ్రై చేసిన తర్వాత వినియోగదారుడికి అందేది కేవలం 70 గ్రాములే. అంటే ఒక్కోసారి 30 గ్రాముల వరకు నష్టం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు.
📌 కొబ్బరి నీటిలో 200 ఎంఎల్ మోసం..!
📌 చికెన్ పకోడీలో 30 గ్రాముల తగ్గింపు..!
ఇలా ప్రజలను నిత్యం మోసం చేస్తున్నా.. తనిఖీ అధికారులు, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బహిరంగంగా జరుగుతున్న ఈ దందాపై అధికారుల మౌనం దేనికి సంకేతమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన శాఖలు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి.. ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Tags: Why are the officials remaining silent while watching?