May 20, 2026
Explore
వామ్మో.. ఒకటి ,పది కాదు ఏకంగా 112 కేసులు…ఎవరో కాదు ..చిల్లర సురేష్!

వామ్మో.. ఒకటి ,పది కాదు ఏకంగా 112 కేసులు…ఎవరో కాదు ..చిల్లర సురేష్!

May 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న చిల్లర సురేశ్ అలియాస్ చల్లా సురేశ్‌పై గుంటూరు జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు.

సుమారు 112 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, నేరప్రవృత్తితో తిరిగే ఇలాంటి వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు.

Tags: Oh my goodness… not just one or ten—but a staggering 112 cases! And the culprit is none other than… Chillara Suresh!