పుంగనూరుముచ్చట్లు:
హిందూసామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజి మహారాజ్ శోభయాత్రకు సంబంధించి ఈనెల 12న జరిగే ర్యాలీ పోస్టర్లను హిందూజాగరణ సమితి అధ్యక్షుడు త్రిమూర్తి రెడ్డి, , పరమేష్, నానబాలమణి విడుదల చేశారు. శుక్రవారం పట్టణంలో పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసి త్రిమూర్తిరెడ్డి మాట్లాడుతూ శోభయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని ఎన్‌ఎస్.పేటలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి, పట్టణ పురవీధులలో హిందూవుల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో హిందూవులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు గంగాధర్, వెంకటేష్, హరి, మణి, మధు తదితరులు పాల్గొన్నారు.
Tags: Chhatrapati Shobha Yatra posters to be released on the 12th.