కీలకంగా మారిన స్నేహితుల వాంగ్మూలాలు
ముగ్గురు యువతులు సహా 10 మంది స్నేహితుల వాంగ్మూలాలు నమోదు
భగీరథ్‌ను కస్టడీకి కోరుతూ నేడు పిటిషన్ వేయనున్న దర్యాప్తు బృందం
సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా డేటా సేకరణపై పోలీసుల దృష్టి
సోషల్ మీడియా ఖాతాల్లోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం
అమరావతిముచ్చట్లు:
సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల సమయంలో భగీరథ్‌తో పాటు ఉన్న స్నేహితుల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ముగ్గురు యువతులు సహా దాదాపు పది మంది స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. సోమవారం కూడా ఇద్దరు యువకులు, ఒక యువతిని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
Tags:The noose tightens in the Bandi Bhagirath case.