తిరుమల ముచ్చట్లు:
వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల కారణంగానే తెల్లగా కనిపిస్తున్న నీరు
టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ పరీక్షల్లో నీరు స్వచ్ఛమని నిర్ధారణ
జపాలి శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద ఉన్న కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది.
వీడియోలో కనిపించినట్లుగా, కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకన్లలోనే సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతోంది. అధిక వాటర్ ప్రెజర్ కారణంగా నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటం వల్ల నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని నిపుణులు తెలిపారు.
ఈ నీటిని తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్‌లో పరీక్షించగా, నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని నిర్ధారణ అయింది. నీటిలో ఎలాంటి దుర్వాసన, అడుగున అవశేషాలు (సెడిమెంట్) లేదా ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపారు.అందువల్ల భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Tags:Do not harbor misconceptions about the water appearing white at Japali.