మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలోని సీటీఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో శనివారం వేకువజామున ఓ దొంగల గ్యాంగ్ ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. స్థానికులు అడ్డు కోవడంతో తుపాకులతో బెదిరించి మరీ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లడంతో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఎస్బీఐ ఏటీఎం యంత్రంలో రూ. 13.5 లక్షల నగదు ఉంచినట్లు ఏటీఎంల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ శనివారం మీడియాకు అధికారికంగా వెల్లడించారు. నలుగురు సభ్యులున్న ఈ ముఠా దొంగతనం చేసిన ఏటీఎం యంత్రాన్ని బొలెరో వాహనంలో తీసుకుని వాల్మీకిపురం మీదుగా నిమ్మనపల్లె, కురపర్తి తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నట్లు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రత్యేక బృందాలతో నిమనపల్లె రెడ్డివారి పల్లి, అగ్రహారం లలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Tags;Gang of thieves steals ATM machine at gunpoint in Madanapalle