May 19, 2026
Explore
గండర గండుడు…మోసగాళ్లకే మోసగాళ్లు.

గండర గండుడు…మోసగాళ్లకే మోసగాళ్లు.

May 19, 2026 | Andhra Pradesh

. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా..పోలీసుల ఎంట్రీ తో..కటకటాల్లోకి!

శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:

ఒక లక్ష రూపాయలకు 10 లక్షల నకిలీ కరెన్సీ పది లక్షలకు కోటి రూపాయలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనలు అనేకం చూశాం.. కాని వీళ్ళెవరో మోసగాళ్లకే మోసగాళ్లలా ఉన్నారు.

నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ అదే బొమ్మ నోట్లు అంటగట్టి మోసం చేశారు

లక్ష రూపాయలకు బదులుగా 10 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని మోసం చేసి పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీ ఇచ్చి బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు

లేపాక్షి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన ఐదుగురు నిందితులు ఎవరికైతే నకిలీ కరెన్సీ కావాలో వాళ్లకు టాయ్ కరెన్సీ అంటగట్టి మోసం చేయడం పోలీసుల్ని షాక్‌కు గురి చేసింది.

లేపాక్షి మండలం కొండూరు క్రాస్ వద్ద ఈ నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకున్నారు.

అలాగే నిందితుల వద్ద పోలీసు యూనిఫాం, సంకెళ్లు, డబ్బుల కౌంటింగ్ మెషిన్, స్కార్పియో, లారీని సీజ్ చేశారు.

Tags: The Ultimate Rogue… a deceiver of deceivers.