అమరావతిముచ్చట్లు:
నీట్ పేపర్ తయారు చేసిన లెక్చలర్లే నిజమైన దొంగల…!లక్షల మంది విద్యార్థుల జీవితాలతో అడుకున్నారు…ఈ నీతి తప్పిన లెక్చరర్లు!
మొన్న కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్! నిన్న బయాలజీ..లెక్చరర్ అరెస్ట్ ! నేడు ఫిజిక్స్ లెక్చరర్ అరెస్ట్!
నీట్ పేపర్ తయారీ ప్యానెల్‌లో అందరూ దొంగలే..విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు.,
మరాఠ్వాడా జిల్లాల్లో పేపర్ లీక్ చేసినట్లు ఫిజిక్స్ లెక్చరర్ అయిన శివరాజ్‌పై ఆరోపణలు వచ్చాయి.
ఇతడి ఫోన్‌లో మే 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది
అంతేకాకుండా అతడి బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు తెలుస్తుంది
ఈ మేరకు సీబీఐ అధికారులు నిందితుడి వద్ద కీలక ఆధారాల స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లలో డిజిటల్ సాక్ష్యాలను సేకరించారు
లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే అంటే ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు శివరాజ్ అందాయి. ఈ ప్రశ్నలను శివరాజ్ చేత్తోనే నోట్స్ రాసి మెటీరియల్ రూపంలో బయటకు తీసుకువచ్చాడని అధికారులు తెలిపారు. పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణితో పాత పరిచయాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. కులకర్ణికి నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)తో సంబంధాలున్నాయి.
శివరాజ్ ఇల్లు, కోచింగ్ సెంటర్‌లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభ్యమైంది. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్‌లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆధారాలతోపాటు నీట్ పేపర్‌లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న వీడియోను సీబీఐ కోర్టుకు చూపడంతో.. కోర్టు శివరాజ్‌కు 9 రోజుల సీబీఐ కస్టడీ ఆదేశించింది.
Tags: Oh my God—this is absolutely atrocious… all out of sheer greed for money.