May 18, 2026
Explore
కూటమి ప్రభుత్వం నుండి మరొక బంపర్ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం నుండి మరొక బంపర్ కార్యక్రమం

May 18, 2026 | Andhra Pradesh

– రూపాయి చెల్లించకుండానే 41 మెడికల్ టెస్ట్​లు!

సంచార వైద్య వాహనాల్లో 41 రకాల సేవలు – ఏటా 56.40 లక్షల మందికి సేవల దిశగా కసరత్తు

ల్యాబ్‌ డయాగ్నస్టిక్‌ సేవలను పల్నాడు, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించారు

త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తెస్తారు.

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్​లో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు (ఎంఎంయూ) 936 ఉన్నాయి. వీటిలో 904 వాహనాలు క్షేత్రస్థాయిలో వినియోగించనున్నారు. మిగిలిన 32ను అత్యవసర పరిస్థితుల్లో తిప్పేందుకు సిద్ధంగా ఉంచారు. వీటిని కొత్త హంగులతో అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే ఆరోగ్య రథం పేరుతో కొన్ని వాహనాలు నమూనాగా సిద్ధం చేశారు.

80 రకాల మందులు – 41 రకాల పరీక్షలు : ఒక్కో 104 వాహనంలో 41 రకాల టెస్ట్​లు చేస్తారు. 80 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. సంపూర్ణ రక్త పరీక్ష (సీబీపీ)కి సంబంధించిన 22 పరీక్షలు, బయో కెమిస్ట్రీకి సంబంధించిన 19 పరీక్షలు అందుబాటులోకి తెస్తారు.

సెల్‌ఫోన్‌లో ఆరోగ్య పరీక్షల ఫలితాలు : కొత్త విధానంలో ఒక మొబైల్‌ మెడికల్‌ యూనిట్ (ఎంఎంయూ) రోజుకు 20 నమూనాలు సేకరించాలి. వైద్య బృందంతోపాటు,

Tags: Another Bumper Program from the Coalition Government