ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిపై హెల్త్ ఎమర్జెన్సీ
ఇప్పటివరకు 88 మంది మృతి
ఈ వైరస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు
సరిహద్దులు మూసివేయొద్దని WHO సూచన
ఆఫ్రికా ముచ్చట్లు:
ప్రస్తుత పరిస్థితి కొవిడ్-19 లాంటి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని సూచించింది. ప్రస్తుత ఉద్ధృతికి ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వైరస్ వేరియంట్ కారణమని అధికారులు గుర్తించారు.
ఈ అరుదైన వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు లేదా వ్యాక్సిన్లు లేవు. కాంగో, ఉగాండాల్లో గతంలోనూ ఎబోలా వ్యాపించింది. అయితే ‘బుండిబుగ్యో’ వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే వేరియంట్ తొలిసారి 2007-2008లో ఉగాండాలో కనిపించింది. అప్పట్లో ఈ వైరస్ బారిన పడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి 2012లో కాంగోలోని ఇసిరోలో 29 మంది మరణించారు.
Tags:Ebola Scare: WHO Declares Global Health Emergency