May 16, 2026
Explore
బిజెపి జిల్లా అధ్యక్షుడు ని ఘనంగా సన్మానించిన పుంగనూరు సీనియర్ నాయకులు

బిజెపి జిల్లా అధ్యక్షుడు ని ఘనంగా సన్మానించిన పుంగనూరు సీనియర్ నాయకులు

May 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్బంగా పుంగనూరు బిజెపి పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.​అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,బీజేపీ సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్,మఠం బాబు,వెంకట్ రెడ్డి,చంద్రశేఖర్ రాజు,రమేష్, జగన్నాధం,శంకర, వెంకటేష్,శ్రీనివాసులు,మల్లికా రాణి,ఈశ్వరమ్మ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గజమాల వేసి ఘనంగా సన్మానించారు.శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణాసంచ పేల్చి, కార్యకర్తలు, నాయకులకు స్వీట్ లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, త్వరలోనే అన్ని నియోజకవర్గలలో పర్యటిస్తామని అన్నారు.​ఈ కార్యక్రమంలో పుంగనూరు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: Senior leaders of Punganur grandly felicitated the BJP District President.