May 15, 2026
Explore
పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

May 15, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగుబ్బ నుంచి ఇద్దరు యువకులు బైక్‌పై పరీక్ష రాసేందుకు మదనపల్లె వైపు వెళ్తుండగా ములకలచెరువు మండలం తుమ్మనం గుట్ట టోల్‌గేట్ సమీపంలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో నరేంద్ర అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన అమరనారాయణపురంకు చెందిన శాంసన్ తన కారులో గాయపడిన యువకుడిని కాండ్లమడుగు క్రాస్ వరకు తరలించి, అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి పంపించారు.

Tags: Accident While Heading to Exam: Young Man Sustains Severe Injuries