శ్రీ సత్యసాయి ముచ్చట్లు
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ నరసింగప్ప సూచనలతో , ఈరోజు కియా పోలీస్ స్టేషన్ ఎస్సై రాఘవయ్య ఆధ్వర్యంలో గుట్టూరు గ్రామంలో బాల బాలికల భద్రత, శక్తి యాప్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కియా ఎస్ఐ రాఘవయ్య పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి , ICDS , మహిళా పోలీస్ ఆశా వర్కర్లు , గ్రామస్తులు పాల్గొన్నారు. మహిళలు, బాలికలు మరియు చిన్నారుల రక్షణపై ఫ్లెక్సీల తో అవగాహన కల్పించేందుకు గుట్టూరు గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఎస్సై రాఘవయ్య మాట్లాడుతూ మహిళలు మరియు విద్యార్థినులకు POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు, మహిళల భద్రత మరియు ఇతర సామాజిక అంశాలపై ఎస్ఐ అవగాహన కల్పించారు.
అదేవిధంగా మహిళలకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ , గ్రామ సచివాలయ మహిళా పోలీసులు ఆశా వర్కర్లు మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:Awareness Program on the Safety of Women and Children