May 12, 2026
Explore
భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

May 12, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు స్థానిక ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డి తెలిపారు.

Tags: Grand palanquin service at Veerabhadraswamy temple along with Bhadrakali