వాల్మీకిపురం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో ఆదివారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాల్మీకిపురం మండలం, తరిగొండ రోడ్డులోని వడ్డిపల్లికి చెందిన వెంకటప్ప(30) తన ట్రాక్టర్ లో ఇసుక లోడుచేసుకొని మదనపల్లికి వెళ్తుండగా, మార్గమధ్యంలోని కాశీరావు పేట ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు..
Tags:Driver killed after car rams into tractor