నిమ్మనపల్లి ముచ్చట్లు:
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఇద్దరు డాక్టర్లు నియమించబడ్డప్పటికీ, ఒకరే విధుల్లో కనిపిస్తున్నారని, మరో డాక్టర్ సక్రమంగా హాజరు కావడం లేదని విమర్శించారు. వారం రోజులుగా ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేరనే సమాచారం అందడంతో ఎమ్మెల్యే పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనారోగ్యంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని హెచ్చరించారు.
Tags: MLA Shajahan Basha Expresses Anger Over Medical Officials’ Performance