May 12, 2026
Explore
పీలేరులో దొంగ నోట్ల కలకలం

పీలేరులో దొంగ నోట్ల కలకలం

May 12, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు పట్టణంలో సోమవారం నకిలీ రూ.100 నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ఓ వ్యక్తి జాతీయ బ్యాంకులో నగదు డిపాజిట్ చేయగా, అందులో కొన్ని రూ.100 నోట్లు నకిలీవిగా మిషన్ గుర్తించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొందరు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని సమాచారం.

Tags: Counterfeit Currency Scare in Pileru