పెద్దమండ్యం ముచ్చట్లు:
పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామానికి చెందిన పి. శ్రీకాంత్ రెడ్డి(34) సౌతాఫ్రికాలో గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆయన ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో ప్రైవేట్ కంపెనీలో గత 11 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా భార్య, పిల్లలతో అక్కడే నివసిస్తున్న శ్రీకాంత్ రెడ్డి రెండేళ్లకోసారి స్వగ్రామానికి వచ్చేవారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతదేహం నాలుగు రోజుల తర్వాత భారత్‌కు చేరుకుంటుందని మృతుడి తండ్రి, మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Tags: Young Man from Kalicherla Dies in South Africa