May 12, 2026
Explore
లక్కిరెడ్డిపల్లె మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

లక్కిరెడ్డిపల్లె మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

May 12, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్లపల్లె కస్బాకు చెందిన పసుపులేటి చిన్నక్క(65) మృతి కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 25న ఇంటి ముందుకు నీరు వచ్చాయన్న విషయంపై పొరుగువారైన సావిత్రి, ఆమె కుమారుడు వేణుతో చిన్నక్కకు గొడవ జరిగింది. తోపులాటలో చిన్నక్క బాత్రూమ్ గోడపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కడప రిమ్స్, అనంతరం తిరుపతిలో చికిత్స పొందుతూ ఈ నెల 7న మృతి చెందింది. మృతురాలి కోడలు రామాంజనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Tags: Accused Arrested in Lakkireddypalle Woman Murder Case