May 12, 2026
Explore
పెండింగ్ బిల్లులకు రూ.16.73 లక్షల నిధుల విడుదల

పెండింగ్ బిల్లులకు రూ.16.73 లక్షల నిధుల విడుదల

May 12, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం రూ.16.73 లక్షలు విడుదల చేసింది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఉగ్రాణంపల్లెలో గ్రామీణ పశువైద్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.77 లక్షలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఆధునికీకరణకు రూ.1.49 లక్షలు మంజూరు చేశారు. అలాగే అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రాచవీటివారిపల్లె వద్ద బాహుదా నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ పనులకు రూ.13.45 లక్షలు విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags: Release of ₹16.73 Lakhs for Pending Bills