మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై అనలైజర్ తో తనిఖీలు….
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు…
శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామాలను సందర్శించి బాల బాలికల భద్రత ,నేరాల నియంత్రణ సైబర్ మోసాలు వంటి వాటిపై పోలీసు అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
సోమవారం రాత్రి నుండి తెల్లవారు జాము వరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు.
అనుమానితుల వేలిముద్రలను సేకరించారు.
డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ఏటీఎం కేంద్రాల వద్ద , ప్రముఖ దేవాలయ ప్రాంతాలలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 కు లేదా డయల్ 100కు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు.
Tags:Visible Policing Intensified During Night Hours