రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి గ్రామీణ పరిధిలోని చిన్నమండెం, సంబేపల్లి మండలాల్లో ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించాలని రాయచోటి రూరల్ సీఐ ఎస్.కే. రోషన్ సూచించారు. భవన నిర్మాణాలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులను 2-3 రోజుల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని తెలిపారు. కార్మికుల పూర్తి వివరాలు, ఆధార్, ఫోటోలు సమర్పించాలన్నారు. భద్రత, నేరాల నివారణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Tags; Registration of Workers from Other States is Mandatory: CI